బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీమ్
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు
మా యొక్క అత్తౌబా షిఫాఖానా ప్రధాన ఉద్దేశము ప్రజలను షిర్క్ (బహు దేవతల)ఆరాధన నుండి రక్షించి మనందరి అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం గారు చూపించిన సన్మార్గంలో నడిపించుట.
నేటి సమాజంలో మానవులు రెండు రకాల వ్యాధులతో జీవనం కొనసాగిస్తున్నారు, అందులో 1)భౌతిక (శారీరక)అనారోగ్యం. 2)ఆధ్యాత్మిక (రూహాని)అనారోగ్యం.
నేటి సమాజ జీవితంలో ఒక పెద్దభాగం ఆధ్యాత్మిక అనారోగ్యాన్ని తిరస్కరిస్తున్నారు.అనగా జిన్,గాలి,జాదూ (చేతబడి), టోన, నరదృష్టి మొదలగునవి.
ఆధ్యాత్మిక అనారోగ్యమో, శారీరక అనారోగ్యమో తెలియక కొంతమంది తమయొక్క ధనాన్ని, సమయాన్ని, వృధా చేసుకుంటున్నారు.
మానవులలో ఒక భాగం వారు ఆధ్యాత్మిక అనారోగ్యాన్ని నమ్ముతారు. కానీ వారికీ సరియైన మార్గం చూపేవారు లేనందున వారు ఇతర బాబాల వద్దకు షిర్క్ పద్ధతులు పాటించే మాంత్రిక తాంత్రికుల వద్దకు వెళ్లి తమయొక్క ధనమును, సమయమును,జీవితమును,తమ విశ్వాసమును(ఈమాన్ )ను సైతం కోల్పోవడం జరుగుతుంది. ఈ రోజులలో బాబాల మాయలలో పడి అధిక శాతం ముస్లిం లు తమ యొక్క విశ్వాసమును (ఈమాన్ )కోల్పోవడం జరుగుతున్నది.
ఆధ్యాత్మిక అనారోగ్యాన్ని తిరస్కరిస్తున్న ఒక పెద్ద భాగం వారు తిరస్కరిస్తునది ఆధ్యాత్మిక అనారోగ్యన్నే కాదు వారు పవిత్ర గ్రంధం ఖురాన్ మరియు హదీస్ షరీఫ్ వాక్యాలను కూడా తిరస్కరిస్తునట్టు(ఆత్మపరిశీలన) చేసుకోవాలి..
పవిత్ర గ్రంధం ఖురాన్ సూర ఆల్ జారియా వాక్యం నెం : 56………………….…………లో చెబుతున్నట్లుగా పవిత్ర ఖురాన్ లో చాలా మార్లు జిన్ (జిన్నాత్ )ల గురించి ప్రస్థావించబడింది . ………..,………..నేను (అల్లాహ్ సుభానహ్ తాఆలా)జిన్నాత్ మరియు మానవులను నా (అల్లాహ్ )యొక్క ఆరాధన కోసమే సృష్టించాను. మరియు సురా ఆల్ రెహమాన్ వాక్యం నెం :34….……………………. లో కూడా జిన్నాత్ ల గురించి ప్రస్థావించబడింది.
మరియు అదే విధంగా పవిత్ర గ్రంధం ఖురాన్ లోని సూర ఆల్ బఖ్రా వాక్యం నెం:102……………………………
సురా యూనుస్ వాక్యం నెం:82………………………………….
ఈ రెండు వాక్యాలలో అల్లాహ్ సుభానహ్ తాఆలా జాదూ(చేతబడి )గురించి ప్రస్థావించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది.
అల్లాహ్ సుభానహ్ తాఆలా పవిత్ర గ్రంధం ఖురాన్ లో జాదూ యొక్క విరుగుడు మరియు జాదూ నుంచి తమను తాము రక్షించుకొనటకు పవిత్ర ఖురాన్ లో ప్రస్థావించడం జరిగింది.
అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం గారి మీద కూడా జాదూ (చేతబడి)అయినపుడు అల్లాహ్ సుభానహ్ తాఆలా పవిత్ర గ్రంధం ఖురాన్ లోని సూర ఫలఖ్ మరియు సూరా నాస్ వాక్యాలతో తో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క జాదూ(చేతబడి) అంతమైనది .కావున ప్రతిరోజు మనం ఈ సూరాలను పఠీoచడం ద్వారా అల్లాహ్ సుభానహ్ తాఆలా మనల్ని పరిరక్షిస్తాడు.
కావున అత్తౌబా షిఫాఖానా ద్వారా ఉమ్మతే ముస్లీమాకు ఈ సందేశమును ఇవ్వదలిచాము. ఉలేమాయేకరం ఎల్లవేళలా ముస్లిం సమాజానికి సరియైన సన్మార్గమును చూపిస్తూ, ఎల్లవేళలా సమాజానికి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. కావున మేము అత్తౌబా షిఫాఖానా ముస్లిం సమాజానికి చేయుచున్న వినతి ఏమనగా?
మీరు ఆధ్యాత్మిక అనారోగ్యం యొక్క (రూహని)చికిత్స చేయించుకొనే ముందు ఉలేమాయే కరాం తో చర్చించిన తరువాతే మీరువెళ్ళగలరు.వారు మాత్రమే సరియైన మార్గమును చూపగలరు. కావున ఉలేమాయే కరామ్ మస్జీద్ యొక్క ఇమామ్ మాత్రమే కాదు, వారు ఉమ్మతే ముస్లీమా యొక్క మార్గదర్శి కూడా అని మనం గుర్తుంచుకోవాలి.